రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VZM: గజపతినగరంలోని నాలుగోడు జంక్షన్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గంగచోళ్ళ పెంట గ్రామానికి చెందిన కనకల లక్ష్మనాయుడు(35) సైకిల్ పై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.