చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా

చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా

VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. గజపతినగరం మండలం లోగీశ గ్రామానికి చెందిన మక్కువ శ్రీధర్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు నేడు విచారణకు వచ్చింది. విజయనగరానికి చెందిన కింతాడ అప్పారావుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు నాలుగు లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.