CIAలో రిక్రూట్‌మెంట్‌.. వినూత్న ప్రకటన

CIAలో రిక్రూట్‌మెంట్‌.. వినూత్న ప్రకటన

అమెరికా గూఢచారి సంస్థ CIA చైనాలో అధికారుల నియామకం కోసం వినూత్నంగా ప్రకటన చేసింది. మాండరిన్ భాషలో రూపొందించిన రెండు ప్రత్యేక వీడియోలను సీఐఏ విడుదల చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ప్రస్తావించింది. ఈ ఉద్యమం వల్ల అసంతృప్తితో ఉన్న వ్యక్తులు సీఐఏలో చేరాలని ఆ వీడియో ద్వారా ప్రేరేపిస్తోంది.