జిల్లా కోర్టులో న్యాయవాదుల క్రీడా దినోత్సవం
VSP: జిల్లా కోర్టులో న్యాయవాదుల క్రీడా దినోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. షటిల్ డబుల్స్‌లో లాయర్ చెన్నా ప్రమోధిని-ప్రవల్లిక జంట ప్రథమ బహుమతి సాధించింది. హైకోర్టు జడ్జీలు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి చీమలపాటి, జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.