రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన

NRML: రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో మండలంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం కొనసాగుతోందని ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కె), తదితర గ్రామాల్లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.