రహమత్ నగర్‌లో రేవంత్ రోడ్ షో
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నవీన్ యాదవ్‌తో కలిసి రహమత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రోడ్ షో అనంతరం శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్ దగ్గర కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.