భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
SRCL: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజన్న స్వామికి ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు, భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. "అందరినీ చల్లగా చూడు రాజన్నా" అంటూ భక్తజనం వేడుకున్నారు.