ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. పంద్రాగస్టును పురస్కరించుకొని శుక్రవారం ఉట్నూరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా జాతీయ జెండాను ఎగరవేశారు. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం మండలాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.