బాలాపూర్‌లో మరో హత్య..!

RR: బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు.