ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

MDK: రామాయంపేటలో కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కోసం ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.