ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టమ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి 332 అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశిస్తూ, సకాలంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లేకుండా ప్రతి అర్జీపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.