పదివేల మంది భక్తులకు అన్న సమారాధన
కృష్ణ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారి వసంతోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. అనంతరం పదివేల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.