రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్లు
RR: యాచారం మండలం పరిధిలోని 24 గ్రామపంచాయతీలకు నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు గురువారం నామినేషన్లు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో అభ్యర్థులను నుంచి పోటీ పెరిగింది.