భారీ వర్షానికి కూలిన ఇళ్లు

MNCL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మందమర్రిలో శుక్రవారం అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి మందమర్రి యాపల్, దుబ్బగూడెం శివకేశవ ఆలయం ముందు గల నడిమెట్ల పోచం అనే నిరుపేద ఇల్లు కూలిపోయింది. రాత్రి సమయంలో ఆ ఇంట్లో లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ పేద కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.