స్థానిక పోరులో ఏకపక్ష విజయమే లక్ష్యం: బోడే ప్రసాద్
కృష్ణా: పెనమలూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన " కార్యకర్తలతో నేను" కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష మద్దతు లభించేలా ప్రజల్లో ఉండి పనిచేయాలని బోడే స్పష్టం చేశారు.