జగన్నాథ్ స్వామికి కార్పొరేటర్ పూజలు

RR: మైలార్‌దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన పూరి జగన్నాథ్ ప్రత్యేక పూజ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. జగన్నాథ్ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.