వడదెబ్బ నివారణకు కలెక్టర్ ఆదేశం

వడదెబ్బ నివారణకు కలెక్టర్ ఆదేశం

SRD: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె స్పష్టం చేశారు.