VIDEO: మిస్సైల్ దాడి.. తప్పించుకున్న మహిళ

VIDEO: మిస్సైల్ దాడి.. తప్పించుకున్న మహిళ

ఇజ్రాయెల్‌ పెటా టిక్వా నగరంలో జరిగిన మిస్సైల్ దాడి నుంచి ఓ మహిళ తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఆమె కారు దిగుతుండగా కేవలం కొన్ని గజాల దూరంలో ఇరాన్ మిస్సైల్ ఒక్కసారిగా వచ్చి పడింది. ఆ ధాటికి ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తేరుకుని స్వయంగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం.