పాలిటెక్నిక్ దరఖాస్తుల గడువు పెంపు
SRD: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. గడువు రేపటితో ముగుస్తుండటంతో ఆసక్తి గల విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.