పైపు లీకేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

పైపు లీకేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

NZB: ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు బాల్కొండ మండల కేంద్రానికి సమీపంలోని లింగమయ్య గుడి దగ్గర మిషన్ భగీరథ పైప్ కి ఏర్పడ్డ లీకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పైపు లీకేజీ ఏర్పడడంతో ఆర్మూర్ పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పైపు లీకేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.