హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు మృతి

హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు మృతి

ఖతార్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఖతార్ సాయుధ దళాలకు చెందిన హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరి ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ-ఖతార్ సంయుక్త దళాల విధుల్లో భాగంగా ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.