మందలించాడని ఉపాధ్యాయుడిపై ఘాతుకం!

మందలించాడని ఉపాధ్యాయుడిపై ఘాతుకం!

W.G: విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయుడిపై పూర్వ విద్యార్థి దాడి చేసిన ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. లంకలకోడేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేవీ రాజా సురేశ్ రెండేళ్ల క్రితం సక్రమ మార్గంలో నడుచుకోవాలని ఓ విద్యార్థిని మందలించారు. కక్ష పెంచుకున్న విద్యార్థి భగ్గేశ్వరం వద్ద సురేశ్‌ను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి గాయపరిచాడు.