విలీనంపై అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్

విలీనంపై అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్

E.G: ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సేవల మెరుగు దృష్ట్యా మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదన లపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోని మూడు మండలాలను రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ బదిలీపై నోటీసు జారీ చేసిందన్నారు.