ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్
NZB: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.