రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
KKD: జగ్గంపేట మండలం నగరం గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం గ్రామానికి చెందిన దొడ్డి అచ్యుత సాయి మనోహర్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఉలవకాయల శివ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు మెరుగైన చికిత్స కోసం కాకినాడ GGHకు తరలించారు.