ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి: వైష్ణవి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి: వైష్ణవి

ELR: దేశ సమగ్రత, సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపునిచ్చారు. గురువారం ముదినేపల్లిలోని తన నివాసంపై ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 'వికసిత్ భారత్' సాధన కోసం ముందుకు సాగాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసి సమైక్యతను చాటాలని ఆమె సూచించారు.