VIDEO: 'శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి'
VZM: పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ తెలిపారు. శనివారం వంగర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి నేరస్తుల పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.