నీళ్లు రావట్లే.. అధికారులేమో పట్టించుకోవట్లే...!

MNCL: కవ్వాల్ గ్రామంలో నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెబితే పట్టించుకోవట్లదని, గ్రామ పంచాయతీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భగీరథ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.