'క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంచుతాయి'
SKLM: క్రీడలు యువతలో మానసిక స్థైర్యం, క్రమశిక్షణను పెంచుతాయని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. కొత్తూరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రిగ్స్ నియోజకవర్గ స్థాయి ఆటలు పోటీలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు.