వైస్ ఛైర్మన్‌కు అవమానం అంటూ వాకౌట్

వైస్ ఛైర్మన్‌కు అవమానం అంటూ వాకౌట్

JN: జనగామ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వివాదాస్పదంగా మారింది. 16వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌కు స్టేజిపై సీటు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైస్ ఛైర్మన్‌కు అవమానమని ఆరోపిస్తూ, నిరసనగా కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.