యువ క్రికెటర్ నితీష్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

GNTR: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వాడి సత్తా చాటారంటూ నితీష్‌ను మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో యువ ఔత్సాహిక క్రీడాకారులకు నితీష్ స్పూర్తిగా నిలిచారని అన్నారు.