రేపు తణుకులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

రేపు తణుకులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

W.G: క్యాన్సర్ మహమ్మారిలా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో గురువారం తణుకులో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తణుకునకు చెందిన దాత చిట్టూరి సుజాత తెలిపారు. హైదరాబాదుకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. తణుకు ZP హైస్కూల్ ఆవరణలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.