'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించిన మంత్రి
సత్యసాయి: పెనుకొండ బస్‌స్టాండ్‌లో 'దివ్యాంగ శక్తి' పథకాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.