దాతల సహాయం కోసం ఎదురుచూపు

దాతల సహాయం కోసం ఎదురుచూపు

KMM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లాడ (M) అన్నారుగూడెంకు చెందిన ఇస్నపల్లి మహేష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మూడ్రోజుల క్రితం బైకుపై వెళ్తూ కిందపడటంతో తలకు గాయమై, మెదడులో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మెరుగైన వైద్యం అందిస్తే కోలుకుంటాడని వైద్యులు చెబుతుండగా పేదరికంలో ఉన్న తమను దాతలు ఆదుకోవాలని వేడుకుంటోంది.