స్వాతంత్ర సమరయోధుడికి ఘనంగా నివాళులు
NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని కెపీజే హై స్కూల్‌లో ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు అస్పాకుల్లా ఖాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైనార్టీ నాయకుడు అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో అస్పాకుల్లాఖాన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్ వారితో ఆయన సాయుధ పోరాటం చేశాడని అమీర్ ఖాన్ అన్నారు.