మోటాపురం సర్పంచ్‌గా ఏలూరి రామారావు
KMM: నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పంచాయతీలో ఈరోజు జరిగిన ఎన్నికలో ప్రజలు సీపీఎం వైపు మొగ్గు చూపారు. సీపీఎం అభ్యర్థి ఏలూరి రామారావు సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆయనకు అత్యధికంగా ఓట్లు పోలవ్వడంతో మోటాపురం సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.