నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అవకాశాలు

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అవకాశాలు

కృష్ణా: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కానూరు తులసినగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో టాలీ, బీపీవో కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్/డిగ్రీ పూర్తి చేసి 18-30 ఏళ్ల వారు అర్హులని వివరించారు. ఏప్రిల్ 6 నుంచి తరగతులు మొదలవుతాయని, శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.