ఆ హక్కు ఒక్క సర్పంచ్‌కే ఉంటుంది: ఎస్సై

ఆ హక్కు ఒక్క సర్పంచ్‌కే ఉంటుంది: ఎస్సై

NZB: బాల్కొండ ఎస్సై కే. శైలేంధర్ ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగంపై కిసాన్‌నగర్‌లో నిన్న రాత్రి అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధికై ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయలాని సూచించారు. ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే సొమ్ము గ్రామాభివృద్ధి కోసం వాడే హక్కు ఒక సర్పంచ్‌కే ఉంటుందన్నారు. అలాంటి పదవికి అర్హత ఉన్న అభ్యర్థినే ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.