14 ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు

KDP: కమలాపురం మండలం కంచెన్నగారి పల్లె సమీపాన ఉన్న పెన్నా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను గురువారం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి, వాటిని MRO ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.