'నల్గొండ కార్యాలయం ముట్టడిస్తే ప్రతిదాడి చేస్తాం'
నల్గొండ బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కార్యాలయంపై దాడికి ప్రయత్నిస్తే ధీటుగా బదులిచ్చేందుకు కర్రలతో సిద్ధమయ్యారు. ఇరుపక్షాల పోటాపోటీ మోహరింపులతో పార్టీ కార్యాలయాల వద్ద యుద్ధ వాతవరణం నెలకొంది.