చెరువు కట్టపై కంప చెట్ల బెడద… రైతుల దారికి అడ్డంకులు

SRPT: మఠంపల్లి మండలం పెదవీడు పరిధిలోని చింతలమ్మ చెరువు కట్టపై కంప చెట్లు విపరీతంగా పెరిగి రహదారిని అడ్డగించాయి. పెదవీడు-మట్టపల్లి మార్గంలో రోజూ భారీగా సిమెంట్ లారీలు తిరుగుతుండగా, అదే దారిని రైతులు, గొర్రెల కాపర్లు తమ పశువులతో ఉపయోగిస్తున్నారు. చెట్లు అడ్డుపడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో గ్రామస్థులు దారి మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.