రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NGKL: వెల్దండ మండలంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై రాఘాయిపల్లి గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం బోలెరో వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కల్వకుర్తికి చెందిన తలసాని గిరిధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.