VIDEO: భోజనం చేస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు భోజనం చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కూడా నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.