తెనాలిలో గాయపడిన వృద్ధుడికి ASI సాయం
BPT: తెనాలి మండలం అంగలకుదురు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వృద్ధుడు గాయపడ్డాడు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఏఎస్ఐ పరుచూరి శ్రీనివాసరావు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. స్థానికుల సహకారంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ చర్యపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.