ఆ 3 గంటల్లో ఏం జరిగింది..?

ఆ 3 గంటల్లో ఏం జరిగింది..?

ఢిల్లీ పేలుడుకు కారణమైన కారు.. ఘటనాస్థలికి మ.3.19 గంటలకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు జరిగిన 6.22 గంటల వరకు కారు అక్కడే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఆ 3 గంటల వరకు కారులో నిందితుడు బయటకు రాకుండా ఏం చేశాడు? వాహనంలోనే ఉండిపోయాడా? ఆ సమయంలో ఎవరినైనా కలిశాడా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.