మాకవరపాలెంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

విశాఖ: మాకవరపాలెం మండలంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో సీతామహాలక్ష్మీ, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ప్రసాద్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రామకృష్ణారావు, పిహెచ్సీలో వైద్యాధికారి సీతారామలక్ష్మి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ, ఎంఈవో మూర్తి పాల్గొన్నారు.