కల్లూరులో డ్రైనేజీలోని వరదనీటి మళ్లింపు

కల్లూరులో డ్రైనేజీలోని వరదనీటి మళ్లింపు

KMM: కల్లూరులో కురిసిన భారీ వర్షానికి పంచాయతీరాజ్ డివిజనల్ కార్యాలయ ఆవరణం వరదనీటితో నిండిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డ్రైనేజీకి అడ్డుగా ఉన్న పిల్లర్ను పగలగొట్టి వరదనీటిని మళ్లించినట్లు మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు.