మోపిదేవి ఆలయానికి భారీ ఆదాయం
కృష్ణా: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి బుధవారం ఒక్కరోజులోనే రూ.7,49,700 ఆదాయం లభించింది. షష్ఠి మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.