బైక్‌ను ఢీ కొట్టి బొలెరో.. తండ్రి కొడుకుకు గాయాలు

బైక్‌ను ఢీ కొట్టి  బొలెరో.. తండ్రి కొడుకుకు గాయాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో జఫర్గడ్-వర్ధన్నపేట రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టడంతో తండ్రి, కొడుకులకు గాయాలయ్యాయి. పాలకుర్తి మండలం రంగాయిగూడెం వెళ్లి వడ్లకొండ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంద కొమ్మలు, రాము గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.