RCB vs SRH.. IPL ఓపెనర్‌కు వర్షం ముప్పు

RCB vs SRH.. IPL ఓపెనర్‌కు వర్షం ముప్పు

IPL 2026 సీజన్ ఓపెనర్‌లో RCB, SRH తలపడనున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో ఈ నెల 28న జరిగే ఈ పోరుకు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు బెంగళూరులో 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనా.. మ్యాచ్ సమయానికి వర్షం పడేందుకు 60% ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో ఆటకు పదేపదే అంతరాయం కలగొచ్చని అంచనా వేసింది.